VKB: కుల్కచర్ల మండలంలోని బొంరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలను మండల విద్యాధికారి జైపాల్ రెడ్డి సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. తరగతి గదుల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి, వారి స్థాయికి అనుగుణంగా బోధన చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.
తెలంగాణ
పాఠశాలలో MEO ఆకస్మిక తనిఖీ


