హైదరాబాద్: 28°C
తెలంగాణ

AIARLA జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా మల్లేష్

BHPL:టేకుమట్ల మండలం సోమనపల్లికి చెందిన వామపక్ష ఉద్యమ నాయకుడు మారపల్లి మల్లేష్ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం (AIARLA) జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. జార్ఖండ్‌లో జరిగిన సంఘం ఎనిమిదవ జాతీయ మహాసభల్లో ఆయనను కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నుకున్నారు. తనపై నమ్మకంతో జాతీయస్థాయి బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.