MDCL: సికింద్రాబాద్‌లోని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధి కార్తీక్ గార్డెన్స్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై మల్కాజిగిరి కమిషనరేట్ SOT కంటోన్మెంట్ టీమ్ ఆదివారం రాత్రి దాడి చేసింది. ఈ దాడిలో 25 మంది పేకాటరాయుళ్లతో పాటు నిర్వాహకుడు చీకోటి విఠల్ కుమార్‌ను అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుంచి రూ.14 వేల నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంది.
తెలంగాణ
పేకాట ఆడుతూ 25 మంది పట్టుబాటు..


