VKB: తాండూరులో కొందరు విద్యార్థులు కళాశాలలకు వెళ్లకుండా పార్కులు, బస్టాండ్ వద్ద కాలయాపన చేస్తున్నారని ABVP నగర కార్యదర్శి మారుతి అన్నారు. విద్యార్థులు ఉదయం వేళల్లో బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సోమవారం తాండూరు డీఎస్పీకి ABVP నాయకులు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
విద్యార్థులపై నిఘా పెట్టాలని ABVP వినతి


