హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

MDK: నర్సాపూర్ పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 64 ఏళ్ల వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం అనంతరం వాహనం ఆగకుండా పరారైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.