హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలమయంగా రోడ్డు.. పట్టించుకోని అధికారులు

KNR: జమ్మికుంట మండలం నాగంపేట-రాచపల్లి రహదారిపై నిర్మించిన వంతెన వద్ద రోడ్డు పూర్తిగా దెబ్బతింది. గుంతలు, పగుళ్లతో రాత్రివేళ ద్విచక్ర వాహనదారులు బోల్తా పడుతున్నారు. పలుమార్లు ప్రమాదాలు జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. R&B అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు