హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మిషన్ భగీరథ నీరు వృథా.. అధికారుల నిర్లక్ష్యం

JGL: ఎండపల్లి మండలం పాతగూడూర్ – గోపాల్‌రావుపేట గ్రామాల మధ్య మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీతో విలువైన తాగునీరు రోడ్డుపై వృథాగా ప్రవహిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంటే.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే లీకేజీని అరికట్టి నీటి వృథాను నివారించాలని కోరుతున్నారు.