MNCL: బెల్లంపల్లి మండలంలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో ఉద్యోగులను బలి పశువులను చేయడం సరికాదని మాజీ MLA దుర్గం చిన్నయ్య అన్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన ప్రజాప్రతినిధులు,అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కలెక్టర్, రామగుండం కమిషనర్ స్పందించి పూర్తి విచారణ జరిపి నకిలీ సర్టిఫికెట్ల బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
'ఉద్యోగులను బలి పశువులను చేయడం సరికాదు'


