హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిన్న BRSలో చేరిక..నేడు అరెస్ట్

WGL: వరంగల్‌లో రాజకీయ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. గత రాత్రి BRS‌లో చేరిన మాజీ కార్పొరేటర్ భర్త ముష్క మల్ల సుధాకర్‌ను సోమవారం ఉదయం మిల్స్‌కాలనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిట్‌ఫండ్ కేసులో అందిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అరెస్టును బీఆర్ఎస్ శ్రేణులు రాజకీయ కక్షసాధింపుగా ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్‌కు తరలివెళ్తున్నాయి.