MDCL: కీసర మాజీ CI అంజనేయులుకు అక్రమాస్తుల కేసులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ACB కోర్టు తిరస్కరించింది. బెయిల్పై విడుదలైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ACB అధికారులు కోర్టుకు తెలిపారు. ఇప్పటివరకు ఆయనకు చెందిన రూ.1.38 కోట్ల ఆస్తులను గుర్తించగా, రూ.కోటి మేర అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపించారు.
తెలంగాణ
కీసర మాజీ CIకి కోర్టులో ఎదురుదెబ్బ


