హైదరాబాద్: 28°C
తెలంగాణ

సత్యసాయి బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం: ఎమ్మెల్యే

MHBD: కురవి మండల కేంద్రంలో నిర్వహించిన సత్యసాయిబాబా 101వ జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రేమ, సేవ, శాంతి, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సత్యసాయి భక్తులు పాల్గొన్నారు.