WGL: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్న జనచైతన్య సభను విజయవంతం చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. సభకు భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల ఆదరణ, అభిమానం పార్టీకి కొండంత బలమని, ఇదే ఐక్యతతో ప్రజా పోరాటాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు: అరూరి


