హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేనేత కార్మికులకు పింఛన్లు ఇవ్వాలి

JGL: రాయికల్ మండలంలోని అర్హులైన పద్మశాలి చేనేత కార్మికులకు పింఛన్లు మంజూరు చేసి న్యాయం చేయాలని పద్మశాలి సేవా సంఘం నాయకులు కోరారు. సోమవారం రాయికల్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఎంపీడీవో చిరంజీవికి వినతిపత్రం ఇచ్చారు. వృద్ధాప్యం, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు బోగ రాజేశం, దాసరి గంగాధర్ పాల్గొన్నారు.