హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మాయమంత్రాలతో నగదు రెట్టింపు మోసం.. ముఠా అరెస్ట్'

ADB: మాయమంత్రాలతో నగదు రెట్టింపు చేస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. నిందితుల వద్ద నుండి భారీగా నగదుతో పాటు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.