హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాకేష్ రెడ్డి గెలుపు కోసం అయ్యప్ప స్వాముల పాదయాత్ర

KMM: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ అయ్యప్ప స్వాములు వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకున్నారు. చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన తూములూరి అరవింద్, పుచ్చకాయల విష్ణు అనే అయ్యప్ప భక్తులు శబరిమలకు పాదయాత్రగా బయలుదేరారు. ఇరుముడితో శబరిగిరులకు చేరుకుంటూ తమ అభిమాన నాయకుడి విజయం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.