KMR: మద్నూర్ మార్కెట్‌లో సోమవారం పత్తి ధర క్వింటాకు రూ.9,300 పలికింది. రెండు రోజుల్లో రూ.100 పెరిగినట్లు రైతులు, వ్యాపారులు తెలిపారు. సోమవారం సుమారు 1,500 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి వచ్చింది. పిట్లం, జుక్కల్, బిచ్కుంద, గాంధారి ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర నుంచి రైతులు పత్తిని విక్రయానికి తీసుకొస్తున్నారు.
తెలంగాణ
మద్నూర్‌లో పెరిగిన పత్తి ధర ఎంతంటే?


