హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బీఆర్ఎస్ నేతల అరెస్టులపై ఎమ్మెల్యే ఆగ్రహం

SRPT: నాగార్జునసాగర్ వద్ద ఏపీ చేపడుతున్నట్లు ఆరోపిస్తున్న ప్రాజెక్టును అడ్డుకునేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీకి వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతించకపోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని విమర్శిస్తూ, అరెస్టు చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.