GDWL: అలంపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో చంద్రకళ ఆధ్వర్యంలో ఇవాళ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రజా వాణికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ, వ్యవసాయ, ఉపాధి హామీ పథకం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రజావాణి కార్యక్రమానికి అధికారుల హాజరు


