హైదరాబాద్: 28°C
తెలంగాణ

దంతాలపల్లిలో ఇందిరమ్మ జీవిత బీమా షురూ

MHBD: దంతాలపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సర్పంచ్ పొన్నోటి బాలాజీ ప్రారంభించారు. గ్రామపంచాయతీ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అర్హులందరూ పంచాయతీ వద్ద అధికారులకు వివరాలు ఇచ్చి నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి అంజద్ అలీ, ఉప సర్పంచ్ వెంకన్న, ప్రజలు పాల్గొన్నారు.