భూపాలపల్లి జిల్లాలో రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం రూ.1.60 కోట్లు కేటాయించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి జాడి బాపురావు వెల్లడించారు. ఎనిమిది యూనిట్లలో జనరల్, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయింపులు జరిగాయని తెలిపారు. అర్హత కలిగిన రైతు సంఘాలు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
వ్యవసాయ యంత్రాల పంపిణీకి రూ.1.60 కోట్ల నిధులు:DAO


