BHPL: మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రకటించిన ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పథకం అమలులో జాప్యం జరుగుతోందిని మహిళలు అంటున్నారు. దరఖాస్తులు స్వీకరించి నెలలు గడుస్తున్నా పంపిణీ ఊసే లేదన్నారు. నవంబర్లో పంపిణీ చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించినా కార్యాచరణ కనిపించడం లేదు. BHPL జిల్లాలో 7,388 మంది దరఖాస్తుదారులకు వెంటనే మిషన్లు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ
కుట్టు మిషన్ల కోసం మహిళలు ఎదురుచూపులు


