హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఛైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన పద్మావతి

AKP: నర్సీపట్నం నూతన మున్సిపల్ ఛైర్ పర్సన్ గా చింతకాయల పద్మావతి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి, ఆర్డీవో వి.వి.రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. దైవ సాక్షిగా ప్రమాణం చేసిన అనంతరం ఆమెను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మున్సిపల్ ఛైర్ పర్సన్ కుర్చీలో కూర్చోబెట్టడంతో సభ మొత్తం చప్పట్లతో మారు మ్రోగింది.