ELR: ఉంగుటూరులోని శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం సోమవారం కావడంతో ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు బిల్వపత్రాలతో స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు ఆలయానికి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉంగుటూరు భీమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిట


