హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోధనపల్లిలో కూటమి సర్పంచ్ అభ్యర్థి ప్రచారం!

ATP: సింగనమల మండలం సోదనపల్లి గ్రామంలో కూటమి మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న పేట గురమ్మ సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులతో కలిసి ఇంటింటికీ వెళ్లి మద్దతు కోరారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన సహా అభివృద్ధే తన లక్ష్యమని, గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు.