NRML: వరి సాగులోనూ రైతుల ఇంజినీరింగ్ నైపుణ్యం కనిపిస్తోంది. పొలంలోని ప్రతి మడికి సమానంగా నీరు చేరేలా ఎత్తుపల్లాలను అంచనా వేస్తూ క్రమపద్ధతిలో మడులు ఏర్పాటు చేయాలి. ఖానాపూర్ మండలం బాదనకుర్తి గ్రామంలోని గోదావరి తీరాన ఉన్న వరి పొలాల మడులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. చిత్రకారుడు మనసుపెట్టి గీసిన కళాఖండాల్లా అందంగా,కనిపిస్తూ ప్రకృతి అందాలకు అద్దం పడుతున్నాయి.
తెలంగాణ
చూపరులను ఆకట్టుకుంటున్న వరి పొలాలు


