హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కిల్లం కోట పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రామన్న

ASR: జి.మాడుగుల మండలం కోట గ్రామపంచాయతీ స్వతంత్ర అభ్యర్థిగా ఎండ్రపల్లి రామన్న పోటీ చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. మా పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచానని తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ ప్రజలందరికీ నమస్కరిస్తూ, తనకు ఒక అవకాశం ఇచ్చి ఆదరించాలన్నారు.