హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు వైసీపీ సిద్ధం: అమర్నాథ్

VSP: జీవీఎంసీలో సోమవారం జరగనున్న నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వైసీపీ కార్పొరేటర్లు బయలుదేరారు. నగరంలో ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మద్దిలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాడతామని పేర్కొన్నారు.