హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటి వెనుక పసికందు మృతదేహం లభ్యం

ASR: సీలేరు దుర్గావీధిలో ఓ ఇంటి వెనుక గుర్తు తెలియని పసికందు మృతదేహం లభ్యమైంది. సోమవారం ఈ విషయం గుర్తించిన పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. 8వ నెలలోనే జన్మించినట్లు, బరువు తక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు మృతదేహాన్ని పడేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎండీ యాసిన్ తెలిపారు.