హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికల బరిలో ఎంపీపీ భర్త

AKP: కోటవురట్ల ఎంపీపీ శెట్టి గీత భర్త విశ్వనాథం పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయన కోటవురట్ల మండలం అన్నవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేశారు. బీసీ జనరల్‌కు కేటాయించిన సర్పంచ్ స్థానానికి టీడీపీ బలపరిచిన విశ్వనాథంతో పాటు వైసీపీ, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు. అయితే ఏకగ్రీవానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.