హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో రేపు గరుడసేవ

CTR: పుంగనూరు కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా రేపు గరుడసేవ నిర్వహించనున్నట్లు టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం ఉత్సవమూర్తిని గరుడ వాహనంపై ప్రత్యేకంగా అలంకరించి.. పురవీధులలో గ్రామోత్సవం నిర్వహిస్తామన్నారు. భక్తులు పాల్గొనాలని కోరారు. అలాగే ఉదయం 9 గంటలకు సత్యనారాయణ స్వామి పూజ జరుగుతుందని అర్చకులు తెలిపారు.