హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గిరిజన విద్యార్థిని మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి'

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం కస్తూర్బా పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్ల గిరిజన విద్యార్థిని నందిక మలేరియా, పచ్చకామెర్లతో మృతి చెందడంపై గిరిజన సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినికి సకాలంలో వైద్యం అందకపోవడమే మృతికి కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని JAC నాయకులు డిమాండ్ చేశారు.