ప్రకాశం: బెస్తవారిపేట మండలంలోని పెంచికలపాడు గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
బేస్తవారిపేట మండలంలో రోడ్డు ప్రమాదం


