NRML: తానూరు మండల కేంద్రంలో విఠలేశ్వరుని ఆలయం ఆధ్వర్యంలో పల్లకీ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. త్రయోదశిని పురస్కరించుకుని నాలుగో రోజు ఆదివారం రాత్రి గజేంద్ర పల్లకీ శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా సాగిన యాత్రలో భక్తులు గజేంద్రుడికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో ప్రాంతం అంతా భక్తి పారవశ్యంతో నిండిపోయింది.
తెలంగాణ
వైభవంగా విఠలేశ్వరుని పల్లకీ సేవ


