NRML: భైంసా పట్టణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్లే మట్టి రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. నిత్యం ఈ దారిలో గ్రామస్థులు, డిగ్రీ కళాశాలకు వచ్చే విద్యార్థులు 3 కిలో మీటర్ల మేర రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రహదారిపై ఏర్పడిన గుంతలు, ఇరు వైపులా పిచ్చి మొక్కలు పెరగడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు శాశ్వత మరమ్మతు చర్యలు చేపట్టాలని చోదకులు కోరుతున్నారు.
తెలంగాణ
విద్యార్థుల రాకపోకలకు తప్పని తిప్పలు


