హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచ్‌లకు బ్యాంకింగ్ అవగాహన శిబిరం

జగిత్యాల జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ నెల 26న మధ్యాహ్నాం 2:30 గంటలకు ఐడీఓసీలో సర్పంచ్లకు బ్యాంకింగ్, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన శిబిరం నిర్వహించనున్నారు. కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో ఆర్బీఐ, నాబార్డ్ అధికారులు పాల్గొననున్నారు. డిజిటల్ బ్యాంకింగ్, సైబర్ మోసాల నివారణ, రుణ సదుపాయాలు, గ్రామీణ జీవనోపాధి పథకాలపై అవగాహన కల్పించనున్నారు.