హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరాటే పోటీల్లో హుజూరాబాద్ పతకాల పంట

KNR: హుజూరాబాద్‌లోని జీఎస్‌కేడీఐ కరాటే అకాడమీ విద్యార్థులు అఖిల భారత ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటారు. ఆదివారం జరిగిన పోటీల్లో తొమ్మిది బంగారు, రెండు రజత పతకాలు సాధించారు. షాదుల్లా బాబా, భానుతేజ, సహస్ర, సాయి అనుకృత తదితరులు స్వర్ణాలు గెలిచారు. శిక్షకుడు ఎస్.కె. జలీల్‌ను క్రీడాభిమానులు అభినందించారు.