హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి.. ఇద్దరు అరెస్ట్

BHPL: మహదేవపూర్ మండలం బెగ్లూరులో కోడి పందేల స్థావరంపై ఎస్సై సాంబమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరో ఆరుగురు పరారయ్యారు. ఆరు ద్విచక్రవాహనాలు, సెల్‌ఫోన్లు, నగదు, కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.