BHPL: భూపాలపల్లి మండలం గుర్రంపేటకు చెందిన సదయ్య ఆదివారం ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. బావుసింగ్‌పల్లి శివారులోని విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఛాతీకి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
నిలిపి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని వ్యక్తి మృతి


