JN:స్టేషన్ ఘన్‌పూర్ మండలం విశ్వనాథపురానికి చెందిన మాచర్ల కృష్ణవేణి దక్షిణాసియా పారా త్రోబాల్ ఛాంపియన్‌షిప్-2026లో రజత పతకం సాధించారు. శ్రీలంకలోని రత్నాపురలో నవంబర్ 19 నుంచి 22 వరకు జరిగిన పోటీల్లో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించారు. రెండో స్థానంలో నిలిచిన ఆమెకు శ్రీలంక గవర్నర్ పతకం అందించి అభినందించారు.
తెలంగాణ
దక్షిణాసియా పారా త్రోబాల్‌లో జిల్లావాసికి రజతం


