హైదరాబాద్: 28°C
తెలంగాణ

చలి తీవ్రతతో ఉపశమనం

ASF: చింతలమానెపల్లి మండల వ్యాప్తంగా రెండు రోజులుగా విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలి విపరీతంగా పెరిగింది. చలి తీవ్రత పెరగడంతో మండల వాసులు సాయంత్రం 5 గంటలైతే చాలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఆలోచిస్తున్నారు. ఉదయం పూట పొగమంచు కూడా కురుస్తోంది.