NLG: జిల్లాలో మున్సిపల్ కార్మికురాలు చందుపట్ల రమణమ్మపై జరిగిన దాడిని నిరసిస్తూ, ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. విధుల్లో ఉన్న కార్మికురాలిపై దాడి చేయడం దారుణమని నాయకులు పేర్కొన్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించడంతో పాటు కార్మికులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
మున్సిపల్ కార్మికురాలిపై దాడికి నిరసన


