NLG: మూసీ నదిలో ఇసుక తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్ డిమాండ్ చేశారు. ఆదివారం శాలిగౌరారంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు తగ్గి, వ్యవసాయ భూములకు ముప్పు ఏర్పడుతుందన్నారు. నదీ పరివాహక గ్రామాల ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ
'మూసీలో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలి'


