హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రాచలం ఆలయానికి దంపతుల భారీ విరాళం

BDK: భద్రాద్రి రామయ్య సేవకు తూ.గోదావరి జిల్లా నలజర్లకు చెందిన రాయుడు రామకృష్ణ, సత్యప్రియాంక దంపతులు ముందుకొచ్చారు. ఆలయ గోశాల కోసం రూ.5 లక్షలు, అన్నదానానికి రూ.5 లక్షల నగదు విరాళంగా ఆదివారం అందజేశారు. వీటితో పాటు స్వామివారికి రూ.4.50 లక్షల విలువైన వెండిని సమర్పించారు. మొత్తంగా  రూ.14.50 లక్షల విలువైన విరాళాలు సమర్పించారు. ఆలయ అధికారులు దాతలను ఘనంగా సత్కరించారు.