JGL: మెట్ పల్లి పట్టణం ఆదివారం సాయంత్రం భక్తి పారవశ్యంతో పులకించింది. ద్యావతి పోతురాజుల ఆధ్వర్యంలో ముత్యాల పోచమ్మ పండగను వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ఘనంగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు, హారతులు చేశారు. మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో బోనాలు ఎత్తి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.
తెలంగాణ
వైభవంగా ముత్యాల పోచమ్మ పండుగ


