WNP: పాన్గల్ మండలం రేమద్దుల గ్రామానికి చెందిన బిక్షపతి నివాసంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని ఫ్రిడ్జ్, కూలర్ సహా నిత్యావసర వస్తువులన్నీ కాలిపోవడంతో సుమారు రూ.4 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. సర్వస్వం కోల్పోయిన తమ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు.
తెలంగాణ
VIDEO: షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం


