హైదరాబాద్: 28°C
తెలంగాణ

తమిళనాడుకు చేరిన స్వాముల పాదయాత్ర

NZB: ఇందూరు నుంచి శబరిమలకు అక్టోబర్లో ప్రారంభమైన అయ్యప్ప స్వాముల పాదయాత్ర ఆదివారం తమిళనాడుకు చేరుకుంది. జ్ఞానేశ్వర్ గురుస్వామి నేతృత్వంలో 40 మంది స్వాములు ఇప్పటివరకు 850 కిలోమీటర్లు నడిచారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్వాములకు శుభాకాంక్షలు తెలిపి, యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.