హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా స్థాయి పోటీల్లో సత్తాచాటిన భద్రాచలం బాలిక

BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి 70వ పాఠశాలల క్రీడా పోటీల్లో భద్రాచలం పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని అట్టం యస్మిత ప్రతిభ కనబరిచింది. అండర్-14, అండర్-17 విభాగాల్లో పోటీపడి పతకాలు, ట్రోఫీతో పాటు ప్రశంసా పత్రాలను సాధించింది. చిన్న వయసులోనే క్రీడల్లో ప్రతిభ చాటిన యస్మితను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.