హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొనసాగుతున్న బ్రిడ్జి పనులు

ASR: పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీ మర్రిదాటు గ్రామంలో బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఏళ్లుగా వర్షాకాలంలో వాగు దాటే క్రమంలో పలువురు కొట్టుకుపోయారని, పిల్లల చదువులకు, సరుకుల రవాణాకు తీవ్ర ఇబ్బందులు పడ్డామని స్థానికులు తెలిపారు. ఎట్టకేలకు వంతెన పనులు చేపట్టిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.