హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలు గ్రామాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్

VZM: గజపతినగరం మండలంలోని బంగారమ్మపేట, కొనిసి, కొత్తబగ్గాం గ్రామాలలో ఆదివారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు 20 మంది పోలీస్ సిబ్బందితో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజల సహకరించాలని కోరారు.