హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పోటీ వద్దు.. ఏకగ్రీవాలకే మొగ్గు: ఎమ్మెల్యే

NLR: పంచాయతీల్లో పోటీ వద్దు.. ఏకగ్రీవాలకే మొగ్గు చూపాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలో ఉండే నాయకులు అందరూ కలిసికట్టుగా మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం తరఫున రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు వస్తాయన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.